అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో మంగళవారం అనంతపురం డివిజన్ స్థాయి సమీక్షలో భాగంగా మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఈఓఆర్డిలు, హౌసింగ్ ఈఈలు, డిఈలు, ఏఈలు, మున్సిపల్ కమిషనర్ లు, పబ్లిక్ హెల్త్, విద్యుత్ అధికారులు, సిడిపిఓలు, ఉపాధి హామీ ఎపిడీలు, ఏపిఓలు, ఇతర మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ గాయత్రీ దేవి, ఆర్డీఓ మధుసూదన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.