కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతో , అలానే కేంద్ర ప్రభుత్వ పధకాలను , రాష్ట్ర పథకాలుగా ప్రజల దగ్గరికి తీసుకుపోతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలలో తప్పుడు సంకేతంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంది అని బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్ వాడీ కేంద్రాల పనితీరును దేశ వ్యాప్తంగా పరిశీలించాలని బిజెపి జాతీయ కమిటీ పిలుపు మేరకు పోషక్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేడు విజయవాడలో అంగన్ వాడీ కేంద్రాన్ని సోము వీర్రాజు పరీక్షించారు.