ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రాయ్‌బరేలీలోని ఓ దళితుడిపై కొందరు వ్యక్తులు దాడి చేసి ఆ వ్య్తి చేత కాళ్లు నాకించిన ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో దళిత యువకుడు నేలపై కూర్చుని చేతులతో చెవ్వులు పట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత మోటార్‌సైకిల్‌పై ఉన్న వ్యక్తి పాదాలను ఆ దళిత యువకుడు నాకాడు. ఆ దళిత యువకుడిని తన చుట్టూ ఉన్నవారు బెదిరించారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అయితే బాధిత దళిత యువకుడు మత్తుపదార్థాలు అమ్ముతున్నట్లుగా మరో వీడియోలో ఉంది. ఆ వీడియో దళిత యువకుడు తాను మత్తుపదార్థాలను అమ్ముతున్నట్లుగా ఒప్పుకున్నాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ ఘటన జరగగా బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.