ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.లక్ష సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు భరోసా యాత్రలో భాగంగా కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి... రైతులకు రూ.లక్ష అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా అనంతపురం జిల్లాలో కూడా పవన్ ఈ యాత్రను ప్రారంభించారు.యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 31 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. రైతు భరోసా యాత్ర మొదటి విడతలో భాగంగా మంగళవారం జనసేనాని ఓ ప్రకటన విడుదల చేస్తూ అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 31 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa