తెలుగుదేశం అధినేత చంద్రబాబు 73వ పడిలో అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల వరకు జనం మధ్యే ఉండాలని భావిస్తున్న ఆయన... ఆ ప్రక్రియకు ఈ రోజే నాంది పలుకుతున్నారు. మహానాడు తర్వాత 15 రోజులకో జిల్లాలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.