తెనాలి పట్టణంలోని ఓ వివాహిత( 25) ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వేరేచోట పని చేస్తున్న అతన్ని ఇక్కడ పట్టణంలోనే పని చేసుకోవాలని గత కొంత కాలంగా ఆమె కోరుతుంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి వారి మధ్య గొడవ జరుగగా తర్వాత ఆమె లోపలి గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.