పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఎం అమరావతి మండల కార్యదర్శి సూరి బాబు డిమాండ్ చేశారు. అమరావతి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధరల పెరుగుదలకు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఆయన మాట్లాడుతూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించిన పన్నులను ఎత్తివేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజు, సలాం తదితరులు పాల్గొన్నారు.