ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను తక్షణమే తగ్గించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సీబీ లత అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో కోడుమూరు పట్టణంలోని స్థానిక కోట్ల సర్కిల్ ల్లో మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా జగన్ పాలన సాగుతోందన్నారు. సామాన్య ప్రజలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వంఒక వైపు కరెంటు చార్జీలను పెంచడంతో పాటు మరో వైపు కరెంటు కోతలను విధించడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఘోరమైన ఓటమి తప్పదని ఆమె హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచు భాగ్యరత్న, టీడీపీ నాయకులు మాజీ సర్పంచు కేయి రాంబాబు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, గోపాల్ నాయుడు, కేయి రాంబాబు, డాక్టర్ ఆంధ్రయ్య, పూల శేఖర్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.