గ్రామాలలో చేపట్టిన ఉపాధి పనులను వ్వవసాయ, రై తు కూలీలు సద్వీనియోగం చేసుకోవాలని ఎంపీడీఓ వీర్రాజు, ఏపీఓ రామకృష్ణ సూచించారు. మంగళవారము తుగ్గిలి మండల పరిధిలోని పెండెకల్, మారెళ్ల, రాంపల్లి గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులను స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి పనులను చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కూలీలు ఎవ్వరూ కుడా గ్రామాలను వదలి వలసలు వెళ్లకుండ ఉన్న ఊళ్లలోనే ఉపాధి పనులను సద్వీనియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో టిఏలు షేక్షావలి, రామకృష్ణ, ఎఫ్ఎలు దివాకర్‌రెడ్డి, చంద్ర, బాలు, రాజు పాల్గోన్నారు.