ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధరలను స్థిరంగా ఉంచడంలో ప్రభుత్వం విఫలమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 11:33 AM

నరసరావుపేట పట్టణంలో స్థానిక 23 వార్డ్ నందు టిడిపి నేతలు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో పాల్గొని,అనంతరం కరెంట్ చార్జీల పెంపు పై వార్డులో కొవ్వతులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ ఇంచార్జ్ అరవింద్ బాబు  మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరలను స్థిరంగా ఉంచడంలో ఎంతో చిత్తశుద్ధితో ఉండేవి దాని వల్ల నిరుపేదలు ఆనందంగా జీవనం సాగించేవారు.మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో పేదలు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఆలోచిస్తారు. ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి ముందు చూపు లేకుండా ఇష్టానుసారంగా శక్తికి మించి హామీలు ఇవ్వడంతో ఆ హామీలతో ఇచ్చిన నగదును ప్రజల వద్ద వివిధ పన్నుల రూపంలో పేద వాడి రక్తం పిండి మరి జగన్ ప్రభుత్వం వసూలు చేస్తుంది అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com