ఆళ్లగడ్డ పట్టణంలో ఓ కోతి తన దాహం తీర్చుకునేందుకు పడరాని ఇక్కట్లు పడింది. గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ పూల వ్యాపారి దప్పిక తీర్చుకునేందుకు వాటర్ బాటిల్ తోపుడు బండిపై ఉంచుకున్నాడు. అది గమనించిన ఆ కోతి ఆ బాటిల్‌ను అక్కడనుండి ఎత్తుకెళ్లింది. తీరా బాటిల్ కు మూత ఉండటంతో దాన్ని తీయడానికి పలుమార్లు ప్రయత్నించి చివరకు అతికష్టం మీద మూత తొలగించి నీరు తాగి మెల్లగా అక్కడనుండి జారుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa