రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాలంగా గొడవపడుతున్నాడు. దీంతో తన భర్త వేధిస్తున్నాడని వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌లో సాలి ఫిర్యాదు చేసింది. తనపై కేసు పెట్టడంతో ఆగ్రహంగా ఉన్న శ్రీను.. మంగళవారం రాత్రి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తండాలోని రామయ్య చెరువులో పడేశాడు.