జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు చెప్పాడు. ఆ ప్రకారంగా చూస్తే ఆయన దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాదిమందికి అన్నదాత అయ్యారు. ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా.లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు. నాన్నగారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు! అంటూ నారా లోకేష్ తండ్రికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.