కొత్తచెరువు మండల పరిధిలోని ఇండ్ల వెంకటం పల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి పార్వతమ్మ తన కొడుకు ఆదివారం నుండి కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
ఎస్ఐ యువకుని తల్లి తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. అయితే గత నాలుగు రోజుల నుండి ఇంటివద్దనే ఉంటూ షాపు పోకుండా ఉండడంతో ఆయువకున్ని తల్లి ప్రశ్నించగా సదరు వ్యక్తి ఏమి సమాధానం చెప్పకుండా ఆదివారం సాయంత్రం 05. 30 గంటల సమయంలో తన మోటార్ సైకిల్ ఏపీ. 39. ఏసీ 2511 లో ఎక్కడికో వెళ్లిపోయాడని ఆమె తెలిపారు.
చుట్టుపక్కల వెతికినా కనపడలే దని అతను వెళ్లేటప్పుడు ఎర్రని టీ షర్టు, నల్లటి జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్లాడని ఆమె ఫిర్యాదు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ, లింగన్న తెలిపారు.