మద్దిపాడు మండలం లోని కౌలు రైతులకు కౌలు కార్డులు 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ లక్ష్మీ నారాయణ తెలిపారు. కౌలు రైతులు తమ గ్రామ పరిధిలోని రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్లి పొలం పాస్ బుక్ జిరాక్స్ కాపీ, కౌలు రైతు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను గ్రామ వ్యవసాయ సహాయకులకు అందజేస్తే కౌలు కార్డులు ఇస్తారని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.