సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లా అధికారులకు పిలుపు నిచ్చారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రగతిపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న అధికారులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు చేపట్టవలసిన అంశాలపై అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు. ఇందుకు ప్రభుత్వపరంగా కావలసిన పరిపాలన అనుమతులు, నిధుల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.