వైసీపీలో ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నానికి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పజెప్పారు. టీడీపీ పార్టీ బలంగా ఉన్న గుంటూరు, పల్నాడు జిల్లాల వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ గా కొడాలి నానిని నియమించారు. ఈ జిల్లాల రాజకీయాల్లో టీడీపీ పార్టీతో పాటు కమ్మ సామాజికవర్గం చాలా బలమైన పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో అదే సామాజికవర్గంకు చెందిన కొడాలి నానికి గుంటూరు, పల్నాడు బాధ్యతలు అప్పజెప్పి టీడీపీని గట్టిగా ఎదుర్కోవాలనే సంకేతాలను సీఎం జగన్ ఇచ్చారు.