ప్రైవేట్ ఆసుపత్రుల్లో, పెట్రోల్ బంకుల వద్ద వాటి యజమానులు తప్పని సరిగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని అదుపుచేసేటందుకు సిలిండర్ను ఉంచుకోవాలని ఫైర్ స్టేషన్ అధికారి లింగమయ్య పేర్కొన్నారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణంలోని తాతిరెడ్డి రామలింగారెడ్డి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని ఏవిధంగా అదుపు చేయాలి అనే విషయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు లక్ష్మీరెడ్డి, సుచరిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.