ఇసుక రీచ్ ఉద్యోగుల పై దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఏర్పేడు సిఐ శ్రీహరి తెలిపారు. ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన జయప్రకాష్ , పవన్ వెంచర్ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం లోని మిట్టమీదకండ్రిక సమీపంలో ఇసుక లోడింగ్ చేస్తుండగా ఆ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సూర్యప్రకాష్ , సుబ్రమణ్యం, బాలయ్యతో పాటు మరికొందరు సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. దీంతో జయప్రకాశ్ పవర్ వెంచర్ కు చెందిన ఏలుస్వామి, ముత్తూ కుమార్, వినోద్ కుమార్ గాయపడ్డారని రీచ్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa