హర్యానకు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి గిన్నిస్ రికార్డు సాధించాడు. కేవలం ఒక్క నిమిషంలోనే 150 కొబ్బరి కాయల్ని పగలగొట్టి రికార్డు నెలకొల్పాడు. లాక్ డౌన్ సమయంలో ధర్మేంద్ర యూట్యూబ్ లో చూసి కొబ్బరికాయల్ని పగలగొట్టడం ప్రాక్టీస్ చేయడంతో ఈ రికార్డును నెలకొల్పాడు.
హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో స్థానిక కూరగాయల మార్కెట్‌లో ధర్మేంద్ర ఈ రికార్డును నెలకొల్పాడు. 60 సెకన్లలోనే 150 కొబ్బరి కాయలు కొట్టి గిన్నీస్ బుక్ రికార్డులో తన పేరును రాసుకున్నాడు. గతంలో కేరళకు చెందిన యువకుడు 122 టెంకాయలు పగలగొట్టగా ఆ తర్వాత జర్మనీకి చెందిన మహ్మద్ అనే మరో వ్యక్తి 148 కొబ్బరి కాయలు పగలగొట్టి రికార్డు సాధించారు. ఇప్పుడు వారి కంటే ఇంకో రెండు కొబ్బరి కాయల్ని ఎక్కువగా అదే టైమ్‌లో పగలగొట్టి ధర్మేంద్ర గిన్నీస్ రికార్డ్ నెలకొల్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa