కుంకుమ పువ్వును సాధారణంగా గర్భిణులకు పాలలో కలిపి ఇస్తుంటారు. పండటి బిడ్డ బాగా ఎర్రగా పుట్టాలని పెద్దలు అలా చేస్తుంటారు. అయితే కుంకుమ పువ్వును మగ వారు కూడా తీసుకోవచ్చిని, దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు శరీరాన్ని సహజసిద్ధంగా మెరిసేలా చేస్తాయి. ముఖంపై మొటిమలు తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. టెన్షన్ ఎక్కువై, డిప్రెషన్‌లోకి వెళ్లిన సమయంలో కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. బాదంపాలతో పాటు కుంకుమ పువ్వు కలిపి తీసుకోవడం వల్ల లైంగిక పటుత్వం, సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన వంటి సమస్యలు దూరమవుతాయి. క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ శరీరంలో పెరగకుండా కుంకుమ పువ్వులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు అడ్డుకుంటాయి. కుంకుమ పువ్వుతో కూడా పాలను రోజూ తీసుకోవడం ద్వారా ఆకలి తక్కువగా అవుతుంది. ఫలితంగా సహజంగానే బరువు తగ్గే వీలుంటుంది. పడుకునే ముందు గ్లాసు పాలల్లో కుంకుమ పువ్వు కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది. కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్ అనే పదార్థం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు జ్వరం తగ్గుతుంది. ఇందులో ఉండే క్రోసిటిన్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పోటు ముప్పుకు చెక్ పెడుతుంది. కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, ఆస్తమా, కోరింత దగ్గు వంటి పలు వ్యాధులను కుంకుమ పువ్వు తగ్గిస్తుంది.