పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ బాబు తో కలిసి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసి రాజకుమారి, డీఈఓ తదితరులు పాల్గొన్నారు.