గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారి సబ్ వే కింద సుమారు 60 సంవత్సరాల వృద్ధురాలు మృతి. గమనించిన స్థానికులు వెంటనే పెదకాకాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలు అక్కడే భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తుందని నిర్ధారించారు. మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం గుంటూరు రుద్రా చారిటబుల్ ట్రస్ట్ వారికి అందించారు.