ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మళ్లీ కరోనా పరీక్ష నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటింటి సర్వేలో ఎవరైనా జ్వరం , దగ్గు, జలుబుతో బాధపడుతూoటే వారిని గుర్తించే పరీక్షలు చేయనున్నారు. కొన్ని రోజులుగా జీరో కేసులు నమోదు అవుతుండగా తాజాగా నాలుగైదు కేసులు నమోదయ్యాయి. అయా కేంద్రాల్లో నిత్యం10-15 శాంపిల్స్ సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.