సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం లో హంద్రీనీవా పెండింగ్ పనులు పూర్తి చేయించాలని ఇరిగేషన్ శాఖ ఎన్ ఈ సి నారాయణ రెడ్డి ను మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి కోరారు. శుక్రవారం ఆయన అధికారులను కలిశారు. బైపాస్ కెనాల్ నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తిప్పేస్వామి చెప్పారు.