శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇద్దరు అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్ చేసినట్లు పెనుగొండ డి. ఎస్. పి రమ్య తెలిపారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.
డిఎస్పీ మాట్లాడుతూ ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై దాడులు నిర్వహించి ఇద్దరూ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి రూ. 32, 54, 500 నగదు, 2 లాప్ టాప్ లు, 57 మొబైల్ ఫోన్స్ , 2 కమ్యూనికేటర్ బాక్సులు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో హిందూపురం రూరల్ సిఐ హమీద్ ఖాన్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.