ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి వరుసగా మూడో ఏడాది స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలకు వైయస్ఆర్ సున్నావడ్డీ నగదు రూ.1261 కోట్లను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. దీని వల్ల అక్షరాల 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుందన్నారు. మూడేళ్లలో అక్షరాల రూ.3,615 కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ నగదు అందజేశామని చెప్పారు. ‘‘ఇంటింటి దీపాలకు, సాధికారత సారధులకు, బాధ్యతలకు ప్రతిరూపాలకు, తమ రెక్కల కష్టాలతో పిల్లలను పెంచుకుంటూ.. కుటుంబాలను నిలబెడుతున్న మణిమాణిక్యాలకు, రాష్ట్రంలోని ప్రతి ఇంటి చరిత్రను సువర్ణ అక్షరాలతో తిరిగి రాస్తున్న అక్కచెల్లెమ్మలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.