ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వచ్చే నెల1, 2 తేదీల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. వైయస్సార్సీపి ఆధ్వర్యంలో ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని నిరుద్యోగుల దృష్టిలో పెట్టుకొని నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్న తెనాలిలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.