గుంటూరు జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకంలో అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి మే నెలలో నగదును ప్రభుత్వం జమ చేయనుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు మధుసూదన్ రావు గురువారం తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో దరఖాస్తున్న వారికి సంబంధించి 22న అనర్హుల జాబితా ప్రకటించి 26న నోటీసులు జారీ చేస్తారు. మే 4న అభ్యంతరాల స్వీకరణ, 9న విచారణ, మే 10న తుది జాబితా వెల్లడి.