ప్రేమ గుడ్డిదని అంటుంటారు. ప్రేమలో పడిన వారు ప్రపంచం గురించి పట్టించుకోరు. ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రేమ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో విశృంఖలంగా ప్రవర్తించడం తప్పు. కర్నాటకలోని చామరాజనగర్ గుండ్లుపేట రోడ్డులో ప్రేమికులు రైడ్‌కు వెళ్లారు. అయితే ప్రేమికుడు తన ప్రియురాలిని ఆమె ఎదురుగా బైక్‌పై పెట్రోల్ ట్యాంక్‌పై ఎక్కించుకున్నాడు. బైక్‌పై ప్రయాణిస్తుండగానే ఆమె తన ప్రియుడికి లిప్ లాక్ ఇచ్చింది. అలాగే రోడ్డు పొడవునా ఇద్దరూ రొమాన్స్ చేశారు. వీరి రొమాన్స్ వీడియోను వారి వెనుకే వెళ్తున్న కొందరు వాహనదారులు మొబైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమికుల అసభ్య ప్రవర్తన చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా చేయడం వల్ల వారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, ఇతరుల ప్రాణాలు తీసే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.