ప్రకాశం జిల్లా కంభం పట్టణం నందు వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీనివాసుని కల్యాణమహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కలియుగ దైవం అయిన శ్రీవెంకటేశ్వరస్వామి సూర్య ప్రభ, చంద్ర ప్రభ , సింహవాహనం, శేష వాహనం, కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, గరుడ వాహనం , గజ వాహనంమీద శ్రీవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి వస్తున్నారు.