ప్రజలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతోంది. తాజాగా వంటనూనెల ధరలు మరోసారి పెరగనున్నట్లు సమాచారం. ఇండోనేషియా ఏప్రిల్ 28వ తేది నుంచి పామాయిల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షులు తెలిపారు. పామాయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే వంట నూనె కొరతను ఇండోనేషియా ఎదుర్కొవడంతో ఈ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
ప్రపంచంలోనే పామాయిల్ ఉత్పత్తిలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. పామాయిల్ ఎగుమతుల్లో ముఖ్యమైన దేశమైన ఇండోనేషియా ఇప్పుడు పామాయిల్ ఎగుమతుల్ని నిషేధించడంతో ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దీనివల్ల పామాయిల్ రేట్లు త్వరలోనే మరింత ప్రియం కానున్నాయి.