ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సింగిల్ డిజిట్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో గత 24 గంటల్లో 2,870 కరోనా పరీక్షలు చేశారు. ఇందులో కేవలం రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 1 కేసు నమోదైంది. కరోనా నుంచి ఇద్దరు పూర్తిగా కోలుకున్నారు. ఏపీలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.