ఓ లేడి కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. గుజరాత్ లోని కచ్ జిల్లాలోని రాపర్ లో ఓ ఆలయం ఉంది. ఆ ఆలయం ఎంతో ప్రసిద్ది. ఆ ఆలయానికి చాలా మంది కాలినడకన వెళ్లి దర్శించుకుంటూ ఉంటారు. అక్కడికి వాహన సౌకర్యం కూడా ఉండదు. ఆ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఓ వృద్ధురాలు వెళ్లింది. అయితే ఆమె చాలా అవస్థ పడాల్సి వచ్చింది. చాలా సేపు నడవడం వల్ల ఆ వృద్ధురాలు అక్కడికి వెళ్లగానే కళ్లు తిరిగి పడిపోయింది.
అక్కడ ఉండేందుకు వీలు లేక తిరిగి వెనక్కి రావడం ఆమె వల్ల కాక దయనీయ స్థితిలో అక్కడే ఉండిపోయింది. అలాంటి సమయంలో ఆమెను ఓ మహిళా కానిస్టేబుల్ గమనించింది. వర్ష పర్మార్ అనే మహిళ కానిస్టేబుల్ ఆ వృద్ధురాలిని తన వీపుపై ఎక్కించుకొని మంటుడెండలో ఐదు కిలో మీటర్ల దూరం వరకు మోసుకుంటూ వెళ్లింది. వృద్ధురాలిని ఆమె మోసుకెళ్తుండగా అక్కడున్నవారు సెల్‌ఫోన్‌లో వీడియో తీయాలని చూసినా వారికి వద్దని చెప్పింది. ఆ మహిళా కానిస్టేబుల్ వర్షా చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.