న్యూస్ ఛానళ్లను కేంద్రం హెచ్చరించింది. జహంగీర్‌పురి హింస, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన వార్తలు రాసేటప్పుడు కేంద్రం పలు సూచనలు చేసింది. వాటికి సంబంధించిన వార్తలు రాసేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. చట్టాలకు అనుగుణంగా ఆ వార్తలకు సంబంధించిన హెడ్‌లైన్స్ ఉండేటట్లుగా చూడాలని హెచ్చరించింది.
శీర్షికలు, ట్యాగ్‌లైన్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995లోని నిబంధనలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్‌ను ప్రచురించడం, ప్రసారం చేయడం తప్పని హెచ్చరికలు జారీ చేసింది.