పలమనేరు పట్టణంలోని శ్రీ తిరుపతి గంగమ్మ జాతర నిర్విఘ్నంగా పూర్తవడానికి గణపతి హోమాన్ని నిర్వహించారు. శనివారం ఆలయంలో ఇందుకోసం ప్రత్యేకంగా హోమగుండం ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా జాతర లేనందున ఈ ఏడాది వైభవంగా చేపట్టాలని నిర్ణయించినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ నరేష్ తెలిపారు. అందులో భాగంగా హోమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమానికి పురపాలక ఛైర్ పర్సన్ పవిత్ర దంపతులు పాల్గొన్నారు.