యల్లనూరు మండల కేంద్రంలో వెలసిన శ్రీ అభయాంజనేయ ఆలయంలో ఆంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆకు పూజ లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి మూలవిరాట్టు ను వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి పూజలు అభిషేకాలు చేయించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు మహా మంగళ హారతిని ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa