మానసిక ఉల్లాసానికి క్రీడలు చాలా అవసరమని ఏపీ వాల్మీకి మాజీ ఫెడరేషన్ డైరెక్టర్ ఉల్లి గయ, వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ మధుసూదన్ లు అన్నారు. మండల కేంద్రమైన కౌతాళం లో ఏర్పాటుచేసిన డివిజన్ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నో వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని వారు కోరారు.ఇలాంటి టోర్నమెంట్ లకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాయకులను పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోవిందు, రామలింగ, రెహమాన్, కురువ వీరేష్, ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa