కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చైనా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ ఫలించటం లేదు. కొంతకాలంపాటు జీరో కొవిడ్ వ్యూహం అమలు చేసిన డ్రాగన్ పదుల సంఖ్యలో కేసులు బయటపడగానే కరోనా పరీక్షలు, లాక్ డౌన్ వంటి కఠిన నిబంధనలు అమలు చేసింది. అయినా వైరస్ వ్యాప్తి తగ్గకపోగా....రోజురోజుకు పెరుగుతోంది. చాలాకాలం నుంచి కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.