ఆదాయాన్ని పెంచుకునేందుకు GST శ్లాబుల సవరణలపై కేంద్రం, రాష్ట్రాల అభిప్రాయాలు కోరిందన్న వార్తలపై. కాంగ్రెస్ మండిపడింది. మధ్యతరగతి ప్రజల పట్ల మోదీ సర్కారు మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. 143 వస్తువుల శ్లాబులను పెంచేందుకు రాష్ట్రాల అభిప్రాయాలను కోరిందని, ప్రస్తుతం 18 శాతం పరిధిలో ఉన్న వస్తువులను 28శాతం శ్లాబులోకి మార్చనుందన్న వార్తలతో..హస్తం పార్టీ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి..పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మండిపడ్డారు. అటు పన్ను రేట్ల పెంపుపై రాష్ట్రాల నుంచి GST మండలి అభిప్రాయాలు కోరలేదని అధికార వర్గాలు తెలిపాయి. GST రేట్ల హేతుబద్దీకరణను పరిశీలిస్తున్న మంత్రుల బృందం.తమ నివేదికను GST మండలికి సమర్పించాల్సి ఉందని పేర్కొన్నాయి. పన్ను రేట్ల హేతుబద్ధీకరణకు.కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో రాష్ట్ర మంత్రుల ప్యానెల్ ను GST మండలి గతేడాది ఏర్పాటుచేసింది.