కేంద్ర ప్రభుత్వ విధానాలపై NCP అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. దిల్లీలోని జహంగిర్ పురి ఘర్షణలను ప్రస్తావిస్తూ...... దేశంలో అస్థిరత నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. తప్పుడు ఆరోపణలతో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అరెస్ట్ చేశారన్న పవార్.కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీ సహా ఇతర ఏజెన్సీలపై ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్ పర్యటనపైనా పవార్ విమర్శలు గుప్పించారు. ఇందిర, రాజీవ్, PV, మన్మోహన్ హయాంలను చూశానన్న పవార్.... అప్పట్లో ఇతర దేశాల నేతలు భారత పర్యటనకు వస్తే దిల్లీ, హైదరాబాద్, కోల్ కతా వెళ్లేవారని అన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయన్న ఆయన.భారత్ కు వచ్చే విదేశీ నేతలంతా గుజరాత్ ను సందర్శిస్తున్నారని అభిప్రాయపడ్డారు.