ఏపీ సీఎం జగన్ కొత్త కేబినెట్ మంత్రులు, జిల్లాల పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లతో ఈ నెల 27న ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కీలక భేటీ జరగనుంది. 27న మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఆ సమావేశంలో పార్టీ పటిష్ఠత క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, పార్టీ అధ్యక్షులను సఖ్యతగా ఉంచడంతో పాటు తద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది.