అనకాపల్లి పుష్ప ఘటన తరహాలో హన్మకొండ పసరగొండలో దారుణం జరిగింది. నెలక్రితమే వివాహం చేసుకున్న యువతి బ్లేడుతో తన భర్త గొంతు కోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భర్తను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.