టీచర్లు చలో సియంఓ పిలుపు నేపథ్యంలో పోలీసులు గుంటూరు హైవేపై పెద్దఎత్తున పహారా కాస్తున్నారు. సిపియస్ రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాత పిoచన్ విధానాన్ని అమలు చేయాలంటూ, యూటీఎఫ్ నేతలు సోమవారం చలో సియంఓ పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో టీచర్ల పిలుపుమేరకు పలు జిల్లాల నుంచి ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు చేరుకుంటారనే ఉద్దేశంతో, గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు పోలీసులు గుంటూరు హైవేల పై పెద్దఎత్తున పహారా కాస్తూ ఉపాధ్యాయులని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.