ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్య వ్యవస్ధలో ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకొనే చర్య ధర్మమేనా.?అని ప్రశ్నించారు. సి.పి.ఎస్ అంశంపై సాధ్యాసాధ్యాల కోసం అధ్యయన కమిటీ ఉందన్నారు. ఆ కమిటీ నిర్ణయం వచ్చిన తరువాత సి.పి.ఎస్ అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు. సుయ్యి మంటే నాదో అట్టు అన్నట్టు తయారయ్యాయి ప్రతిపక్షాలు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.