సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సీఎంఓ ముట్టడి కార్యక్రమం నేపద్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఉపాధ్యాయులు చేపట్టిన సీఎంఓ కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై సీఐ కోమాకుల శివాజీ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల నుండి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు కళ్ళుకప్పి ఉపాద్యాయులు సీఎంఓ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం రావడంతో పోలీసులు వాహనాల్లో ప్రయాణించే వారి సెల్ ఫోన్ సైతం చెక్ చేసి పంపించారు.