ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యూటీఎఫ్ సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామనడం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. సీపీయస్ విధానంపై ఇప్పటికే కమిటీ వేశామని. ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని తెలిపారు. దానిపై మళ్లీ ఓ సమావేశం కూడా జరగనుందని చెప్పారు. ఉపాధ్యాయుల సెలవుపై టీడీపీ, బీజేపీ అనవసర రాదాంతం ఎందుకు చేస్తున్నాయని మండిపడ్డారు.