పిల్లలకు పాఠాలు నేర్పించి, వారి భవిష్యత్‌కు మార్గదర్శకం కావాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పాఠశాలకు రాగానే పాఠాలు చెప్పాల్సింది పోయి...సమావేశం పేరుతో తరచూ ప్రిన్సిపాల్ గదికి వెళ్లేది. మొదట్లో నిజంగానే సమావేశమేమో అని అంతా అనుకున్నారు. అయితే గ్రామస్తులకు అనుమానం వచ్చి నిఘా పెట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ మహిళ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూ పిల్లలకు పాఠాలు బోధించాల్సిన ఆమె... కొన్ని రోజులకు అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం మొదలెట్టింది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ పాల్‌తో సమావేశం పేరుతో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేది. సమావేశం పేరుతో ప్రిన్సిపాల్ గదికి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరూ కలిసి ఏకంగా గదిలోనే రాసలీలలు సాగించేవారు. వీరిపై పాఠశాలలో ఎవరికీ అనుమానం రాలేదు.
అయితే ఈ విషయం గ్రామస్తులకు తెలిసి నిఘా పెట్టారు. ఓ రోజు కొందరు పాఠశాలలకు వెళ్లి గదిలో పరిశీలించగా.. ప్రిన్సిపాల్‌తో రాసలీలలు సాగిస్తూ పట్టుబడింది. ఈ సమయంలో కొందరు ఫోన్‌లో వీడియోలు తీశారు. అనూహ్య పరిణామానికి అవాక్కయిన ప్రిన్సిపాల్... వీడియోలు తొలగించేందుకు డబ్బులు ఆశ చూపాడు. దీనిపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు.. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.