విశాఖ బీచ్ రోడ్డులో పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ ఆలయ నిర్మాణనికి వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. మత్స్యకారుల కుల దేవతలైన అమ్మవార్ల ఆలయాన్ని చరిత్రలో నిలిచే విధంగా తమిళనాడు, కోయంబత్తూర్ నుండి గ్రానైట్ తెప్పించి, నేనే స్వయంగా కట్టిస్తానని హామీ ఇచ్చారు. అలానే ... ఇచ్చిన మాట ప్రకారం నాలుగు నెలల్లోనే రామతీర్ధం శ్రీ కోదండ రాముని ఆలయ పుననిర్మాణం పూర్తి చేసినట్లు తెలియచేసారు. 3 కోట్ల వ్యయంతో బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే పునర్నిర్మాణం, అదనపు వసతులు కల్పన అని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆలయాలు, విగ్రహాలతో రచ్చ చేయాలనుకునే వారిని ఇక ఆ శ్రీరామచంద్రుడే చూసుకుంటారు అని అన్నారు.