రాష్ట్రంలో సాగుతోంది ప్రజాస్వామ్యమా? రాజరికమా? రాక్షసులపాలనా? అని టీడీపీ నాయకులూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేసారు. వారంలో రద్దు చేస్తా అని చెప్పి తమకు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పుకోడానికి ఉద్యోగులు విజయవాడ కు వస్తే అధికార మదంతో పోలీసులను ప్రయోగించి అరెస్ట్ చేస్తారా, అడ్డుకుంటారా ? ..మాట తప్పను మడమ తిప్పను అంటావే మరి అధికారంలోకి వచ్చి 150 వారాలకు పైగా అయినా ఇంకా కమిటీల పేరుతో సాగదీస్తున్నావ్. ఇది నీ చేతకాని తనానికి నిదర్శనం కాదా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు.